పల్లె ప్రగతి కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్
తెలంగాణ ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సెప్టెంబరులో 30 రోజులు ప్రతి పల్లెలోనూ పరిశుభ్రతపై దృష్టిపెట్టారు. అది మంచి ఫలితాలని ఇచ్చిందన్నారు సీఎం కేసీఆర్. ఆదివారం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
‘పల్లె ప్రగతి’ పరిశీలన కోసం జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలో దిగుతున్నాయని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తాయని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.