కాజల్ బికినీ ట్రీట్ 


స్టార్ హీరోయిన్ కాజల్ అభిమానులకి బికినీ ట్రీట్ ఇచ్చింది. అలాగని.. ఇదేదో సినిమా కోసం కాదు. ప్రస్తుతం కాజల్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తోంది. ఈ సందర్భంగా బికినీలో పోజులిచ్చిన ఫోటోలని కాజల్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అవి చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ? సినిమాల్లో కనిపించిన దానికంటే.. శృతిమించి మరీ.. గ్లామర్ షో చేసింది కాజల్. ఆమె బికినీ అందాలని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు.

కాజల్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మ కొలువుదీరనుంది. టుస్సాడ్స్ ప్రతినిధులు కాజల్ ని కలిసి ఆమె కొలతలు తీసుకున్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 20న కాజల్ మైనపు బొమ్మ  మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు. ఈ గౌరవం దక్కనున్న తొలి దక్షిణాది కథానాయిక కాజల్ నే కావడం విశేషం.