సరిలేరుపై విజయశాంతి షాకింగ్ పోస్ట్


సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. దీంతో సరిలేరు కోసం లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నటించడమే కాదు.. ఈ సినిమా కోసం విజయశాంతి రంగంలోకి దిగారు.

సరిలేరు టైటిల్ సాంగ్ విడుదలపై తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు లేడీ సూపర్ స్టార్. అది ఓ లెటర్ లా.. ఆసక్తికరంగా ఉంది. దాన్ని మీరు చదవండీ.. !

మనం భారతీయులం

సరిలేరు మనకెవ్వరు

సంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..

ఇది మన దేశం నేర్పిన విధానం

ఆ ఉన్నత విలువలతో కూడిన ఒక చక్కని సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్ నెంబర్ నేటి సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. జనవరి 5, 2020వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, ఈ సందర్భంగా మన సినిమాను అభిమానంతో స్వాగతిస్తున్న ప్రజలకు, అభిమానులకు గౌరవ అతిథులకు ధన్యవాదాలతో.. 

మీ

విజయశాంతి