సంక్రాంతికి 159 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సీజన్ లో 159 ప్రత్యేక రైళ్లని నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండగకి సొంతూరుకు బయలుదేరనున్న ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాచిగూడ – శ్రీకాకుళం (07016), శ్రీకాకుళం- తిరుపతి (07479), తిరుపతి- కాచిగూడ (07146), విజయవాడ రాయనపాడు మీదుగా శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కాచిగూడ- శ్రీకాకులం మధ్య సువిధ ప్రత్యేక రైలును నడపనున్నారు. 

ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్ రేట్లు ప్రత్యేకంగానే ఉండనున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్ రేట్లని పెంచి అమ్మనున్నారు. సాధారణ టికెట్ రేట్లతో పోలీస్తే ప్రత్యేక రైళ్లలో డబుల్ ఛార్జీలు వసూలు చేయనుందని తెలుస్తోంది. పండగ సీజన్ ని దక్షిణ మధ్య రైల్వే కూడా క్యాష్ చేసుకుంటుంది అన్నమాట.