ఈ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ?

ఇదివరకు కండలు పెంచడం, సిక్స్ ప్యాక్ చేయడం, షర్ట్ విప్పేసి.. ఆ బాడీని చూపించడం బాలీవుడ్ హీరోలే చేసేవారు. ఇప్పుడా పనులు టాలీవుడ్ హీరోలు కూడా చేస్తున్నారు. స్టార్ హీరో నుంచి యంగ్ హీరో వరకు ప్రతి ఒక్కరు ఏదో సినిమా, ఏ సందర్భంలో సిక్స్ ప్యాక్ బాడీ చేస్తున్నారు. కానీ, ఎప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించే తెలుగు హీరో సుధీర్ బాబు. అవునూ.. సుధీర్ ఎప్పుడూ సిక్స్ ప్యాక్ మెయిన్ టైన్ చేస్తారట.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రానా దగ్గుపాటి తెలిపారు. ఒక్కసారి సిక్స్ ప్యాక్ చేయడానికి మాకు చుక్కలు కనిపిస్తాయి. కానీ, సుధీర్ బాబు ఎప్పుడూ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తారు. నిజంగా చాలా గ్రేట్ అన్నారు రానా. తాజాగా వీడియోలోనూ సుధీర్ బాబు కండలు పెంచి కనిపిస్తారు. జిమ్ లో కసరత్తు చేస్తున్నప్పుడు వెనకాల నుంచి తీసిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో చేశాడు.

 ప్రస్తుతం సుధీర్ బాబు ‘వి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. మరో హీరోగా నాని నటిస్తున్నారు. ఇందులో  నాని నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. ఆయనకి జంటగా అతిథి హైదరి కనిపించనుంది. ఇక సుధీర్ బాబుకి జంటగా నివేదా థామస్ నటిస్తున్నారు.