బుట్టబొమ్మపై శాస్త్రీ కామెంట్స్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ నుంచి బుట్టబొమ్మ ఫుల్ సాంగ్ ఈ సాయంత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పాటని రచించిన రామజోగయ్య శాస్త్రీ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తిర లైన్స్ రాశాడు.
“మల్టీప్లెక్సులోని ఆడియెన్సులాగా
మౌనంగున్నాగానీ అమ్మూ
లోన డండనక జరిగిందే నమ్ము
దిమ్మదిరిగినాదే మైండు సిమ్ము 💕” అని రాసుకొచ్చాడు.
ఇక అల.. నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూడు సాంగ్స్ సూపర్ హిట్. సామజవరగమన, రాములో రాములో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తెలుగు పాటలుగా తొలి రెండు స్థానాలని ఆక్రమించాయి. ఈ సినిమాకి థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. త్రివిక్రమ్ మరోసారి తన రాత, తీతతో ప్రేక్షకులకి మంచి సినిమా అందించబోతున్నట్టు అనిపిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. యంగ్ హీరో నవదీప్, సుశాంత్ లకి మంచి పాత్రలు దక్కాయని చెబుతున్నారు.
Love u all..cant keep u music lovers waiting…enjoy this 4 now
మల్టీప్లెక్సులోని ఆడియెన్సులాగా
మౌనంగున్నాగానీ అమ్మూ
లోన డండనక జరిగిందే నమ్ము
దిమ్మదిరిగినాదే మైండు సిమ్ము 💕BUTTABOMMA….Wholesome magic today evening 4:05pm👍 pic.twitter.com/auSOXlpbJG
— Ramajogaiah Sastry (@ramjowrites) December 24, 2019