తెరాస ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసిన కెనడా మీడియా

ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, తెలంగాణ పీసీసీ చీఫ్ సతీమణి పద్మావతిపై 43,233 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

1974 ఏప్రిల్ 18 న సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో సైదిరెడ్ది జన్మించారు. డిగ్రీ తరువాత కెనడా వెళ్ళిపోయారు. అక్కడే స్థిర పడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పుడు.. దీనికి ప్రభావితమైన సైదిరెడ్డి ఎన్నారైలతో కలిసి ఉద్యమించారు. తెలంగాణాకు తిరిగి వచ్చిన తరువాత ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఉత్తమ్ ఎంపీగా గెలిచి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో సైది రెడ్డి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సైదిరెడ్డి తొలిసారి కెనడా వెళ్లారు. అక్కడ ఆయనకి భారీతీయులు ఘన స్వాగతం పలికారు. అక్కడి మీడియా సైదిరెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.