దేవిశ్రీ అందరినీ టార్గెట్ చేశాడు

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. అందరినీ టార్గెట్ చేశారు. సంక్రాంతి సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో సినిమాల విపరీతమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్  నుంచే ఆ హీట్ కనిపిస్తోంది. ముందుగా వచ్చిన అల.. పాటలు సరికొత్త రికార్డులు సృష్టించడంతో.. ఆ ప్రెజర్ దేవిశ్రీ పై పడిందనే ప్రచారం జరిగింది. కానీ, దేవి అవేవి పట్టుంచుకోకుండా.. సరిలేరు కథని తగ్గ సంగీతాన్ని అందించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అన్నీ వర్గాల ప్రేక్షకులని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

సరిలేరు నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ లో #MindBlock – యూత్ మాస్ గా ఆకట్టుకుంటోంది. #SarileruNeekevvaruAnthem-మూవీ థీమ్ అదిరిపోయింది. ఈ పాట రాసింది కూడా దేవిశ్రీనే. ఈ పాటని వింటుంటే దేవిశ్రీలో ఓ సైనికుడు ఉన్నాడనే విషయం అర్థమయింది. ఇక, #SuryudivoChandrudivo – సాంగ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయింది. #HeIsSoCute – గర్ల్స్ బాగా ఇష్టపడుతున్నారు. ఇక Next item song – మాస్ ఆడియెన్స్ కోసం. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా చిందేయనుంది. అందుకే దేవిశ్రీ అందరినీ టార్గెట్ చేశాడని చెప్పుకుంటున్నారు.