తాను వేశ్యను కాదు.. బాలీవుడ్ హీరోయిన్ ఆవేధన !
తనపై వేశ్యగా ముద్రవేశారని.. తాను వేశ్యని కాదని అంటోంది బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్. 2013లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణెతో కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించింది కొచ్లిన్. ఆ తర్వాత ఆమెకి సరైనా అవకాశాలు రాలేదు. దానికి కారణం ఓ నిర్మాత పడకగది పిలుపుకి నో చెప్పడమేనని కొచ్లిన్ తెలిపింది.
తాజాగా కల్కీ కొచ్లిన్ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘యే జవానీ హై దివానీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదల తర్వాత నాకు తొమ్మిది నెలలపాటు ఎటువంటి ఆఫర్ రాలేదు. ఖాళీగా ఉన్నాను. హిట్ వచ్చినా ఇలా జరగడం బాధగా అనిపించింది’ అని కల్కి చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో వేధింపులపై స్పందిస్తూ.. బాలీవుడ్, హాలీవుడ్ లోనూ వేధింపులు ఉన్నాయి. ఓ నిర్మాత నన్ను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వేధించాడు. తనతో పాటు డేట్‌కు రావాలని అడిగాడు. నేను దానికి ఒప్పుకోలేదు. దీంతో నన్ను ఆ సినిమాకు వద్దనుకున్నాడని చెప్పింది.
‘దేవ్ డి’ సినిమాలో నన్ను చూసి కొందరు ‘రష్యన్ వేశ్య’ అన్నారు. ‘ఈ రష్యన్ వేశ్యను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?’ అని అన్నారు. ‘నేను రష్యన్‌ను కాదు’ అని చెప్పుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ‘దేవ్ డి’ సినిమాలో కల్కి వేశ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక కల్కి త్వరలో ఓ శిశువుకు జన్మనివ్వబోతుంది. ఇటీవల కల్కీ నెట్‌ఫ్లిక్ ”సేక్రెడ్ గేమ్స్’లో కనిపించారు.