త్రివిక్రమ్ ఆఫీసులో జీఎస్టీ దాడులు?
హైదరాబాద్ లోని సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారమ్. మొత్తం 23 బృందాలుగా విడిపోయి జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామిక వ్యాపారవేత్తల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ లిస్టులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు సమాచారమ్. ఆయనకి సంబంధించిన ఆఫీసులు సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్, వక్కంతం వంశీ కార్యాలయాలపైనా, సినీ నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్, సితారా ఎంటర్ టెయిన్ మెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. దర్శక నిర్మాతలు, బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పుడు ధ్రువపత్రాలను దాఖలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని ఎగ్గొట్టారనే సమాచారంతో జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.