చంద్రబాబుపై మిస్సింగ్ కేసు
ఈ మధ్య ఏపీలో ప్రజా ప్రతినిధులపై మిస్సింగ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటుపై అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కనబడటం లేదంటూ మిస్సింగ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అమరావతికి చెందిన మహిళలు ఈ కేసులని నమోదు చేశారు. తాజాగా ఇలాంటి మిస్సింగ్ కేసునే తెదేపా అధినేత చంద్రబాబుపై పెట్టారు.
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కనబడటం లేదంటూ కుప్పం వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారి మాత్రమే కుప్పం వచ్చారు. ఆ తర్వాత కనిపించడం లేదు. సమస్యలని విన్నవించుకుందామంటే.. తమ నియోజకవర్గానికి రావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో చాలానే నమోదుకావడం చూశాం. ఐతే, 40యేళ్ల రాజకీయ అనుభవం గల చంద్రబాబుపై మిస్సింగ్ కేసు నమోదు అవ్వడం బహుశా.. ఇదే తొలిసారి.