బుట్టబొమ్మ సాంగ్ విన్నారా ?

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తాజాగా ఈ సినిమా నుంచి నాల్గో పాటగా బుట్టబొమ్మ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటని రామజోగయ్య శాస్త్రీ రాశారు. అమ్రాన్ మాలిక్ పాడారు. థమన్ సంగీతం అందించారు. బుట్టబొమ్మ వినడానికి అద్భుతంగా ఉంది.