దీపికకు స్వేచ్చనిచ్చిన సినిమా
హీరోయిన్స్ బయట కనిపిస్తే అంతే సంగతులు. ఆమెని చూసేందుకు జనాలు ఎగబడతారు. ఫోటోలు దిగేందుకు పోటీపడతారు. కొందరు ఆకతాయిలు ఇబ్బందులకి కూడా గురి చేస్తారు. ఇక దీపికా పదుకొనె లాంటి స్టార్ హీరోయిన్ బయట కనిపిస్తే.. ఇంకేమైనా ఉంటుందా.. ? కానీ, ఛపాక్ సినిమా షూటింగ్ సమయంలో ఆమెని గుర్తుపట్టలేదట. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. జనవరి 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న దీపికా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఛపాక్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనను ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో చాలా స్వేచ్ఛగా ఫీల్ అయ్యా. ఢిల్లీలోనే షూటింగ్ చేసిన ఎవరు గుర్తుపట్టకపోవడంతో స్వేచ్ఛగా ఉన్న భావన కలిగింది. కొన్నేళ్లపాటు బయట నచ్చినట్లు ఉండగలిగానని చెప్పుకొచ్చిది. ఇక సినిమా నిర్మాణంలోనూ దీపిక భాగస్వామి అయ్యింది. మరీ.. నిర్మాతగా దీపిక తొలి హిట్ కొడుతుందేమో చూడాలి.