గంటా వేరు కుంపటి

తెదేపాలో ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వేరు కుంపటి పెట్టినట్టు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా గంటా తెదేపాతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెదేపాని వీడతారని.. వైకాపా లేదా భాజాపాలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇంతలో విశాఖలో గంటా వేరు కుంపటి పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం విశాఖలోని ఓ స్టార్ హోటల్ లో ఆ ప్రాంతానికి చెందిన తెదేపా నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి దగ్గరుండి గంటా ఏర్పాట్లు చేశారు.

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని స్వాగతించాలని ఈ సమావేశం తీర్మాణం చేసింది. విశాఖ ప్రజలకి ఇదో సదావకాశం. కచ్చితంగా విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని ఆహ్వానించే బాధ్యత తమపై ఉందని గంటా అన్నారు. అదే సమయంలో రాజధాని రైతులకి న్యాయం చేయాలని ఈ సమావేశంలో తీర్మాణం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, రాజధానిగా అమరావతియే ఉండాలని తెదేపా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో వేరే దేశం ఏర్పడినట్టు అయిందని చెప్పుకొంటున్నారు.