డబ్బింగ్ సినిమాలకు చెక్

ఇకపై పండగ పూట డబ్బింగ్ సినిమాలకి బ్రేకులు పడనున్నాయి. ఈ మేరకు నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారమ్. డబ్బింగ్ సినిమాల జోరు పెరగడం వల్ల తెలుగు సినిమాలకు ఇబ్బంది కలుగుతోంది. అదే పండగ సీజన్’లో అయితే, థియేటర్స్ కొదవ ఏర్పడుతోంది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన నిర్మాతల మండలి పండగ (దసరా, దీపావఌ, సంక్రాంతి) సీజన్స్’లో డబ్బింగ్ సినిమాలకు బ్రేకులు వేయాలని నిర్ణయించింది.

నిర్మాత మండలి తాజా నిర్ణయంతో సూపర్ స్టార్ రజనీ కాంత్ రోబో ‘2.ఓ’ సినిమా దాటి నుంచి తెలుగు సినిమాలని కాపాడుకోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు బ్రేకులు వేయబోతున్నారు సరే.. మరీ.. తెలుగు సినిమాలు కూడా తమిళ్, మలయాళం.. బాషల్లో డబ్ అవుతున్నాయి కదా.. ! ఇదీగాక, డిజిటల్ ప్రసారాల రేట్లు తగ్గించుకొంటే వచ్చే యేడాది మార్చి 1 నుంచి సినిమాలని నిలిపివేయాలని ఆలోచన చేసింది.