హాజీపూర్ కేసు నేడే తుదితీర్పు.. ఉరిశిక్ష ఖాయమా ?
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలని అత్యంత దారుణం అత్యాచారం చేసిన హత్య చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని మరోసారి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆఖరిసారి నిందితుడి అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఈ కేసులో తుదితీర్పుని ఇవ్వనుంది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. బహుశా.. రెండు మూడ్రోజుల్లోనే హాజీపూర్ ఘటనపై తుది తీర్పు రానుందని తెలుస్తోంది.
హాజీపూర్ గ్రామంలో మనీషా, శ్రావణి, కల్పన అనే ముగ్గురు అమ్మాయిలు శ్రీనివాస్ రెడ్డి క్రూరత్వానికి బలైన సంగతి తెలిసిందే. బైక్ పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. తన వ్యవసాయ భూమి వద్దకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసి వ్యవసాయ భావిలో పూడ్చిపెట్టేవాడు. ఈ కేసులో నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు రెండు నెలలుగా విచారణ జరుపుతోంది. వారానికి ఐదు రోజులు విచారణ సాగించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 300మంది సాక్షులని విచారించారు. వారి వాగ్మూలాలని తీసుకొన్నారు.
ఫైనల్ గా ఈరోజు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కోర్టు విచారించనుంది. అనంతరం తుది తీర్పుని వెల్లడించే అవకాశాలున్నాయి. నిందితుడికి శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, ఇప్పటి వరకు నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి శిక్ష విధించకపోవడంపై హాజీపూర్ గ్రామస్థలు అసహనం వ్యక్తం చేస్తున్నాదు. దిశ కేసులో వారం రోజుల్లోనే న్యాయం చేశారు. మరీ.. ఈ కేసులో ఎందుకు న్యాయం చేయడం లేదని బాధితిరాళ్ల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.