సుకుమార్ మరోసారి రివేంజ్ తీర్చుకుంటాడా ?


క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మరోసారి రివేంజ్ తీసుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. సుకుమార్ సినిమా అంటేనే రివేంజ్ డ్రామాలకు పెట్టింది పేరు. మహేష్ తో ‘1 నేనొక్కడినే’, తారక్‌తో ‘నాన్నకు ప్రేమతో’, రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ రివేంజ్ కథలే. కాకపోతే దేనికదే ప్రత్యేకమైనది. ఇప్పుడు అల్లు అర్జున్ తో సుకుమార్ చేయబోతున్న సినిమా కూడా రివేంజ్ కథనే అని తెలుస్తోంది. 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బన్నీ సినిమా తెరకెక్కనుందట. ఇందులో బన్నీ గుబురుగెడ్డంతో ఊరమాస్ లుక్ లో కనిపిస్తారని చెబుతున్నారు. హీరోయిన్ రష్మిక మందన ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నారు. జనవరి రెండోవారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

ఇక త్రివిక్రమ్-బన్నీ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు సామజవరగమన, రాములో రాముల అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటలుగా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.