సమంత చేతుల మీదుగా ‘అశ్వద్ధామ’ టీజర్

యంగ్ హీరో నాగ్ శౌర్యతో హీరోయిన్ సమంతకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరు కలిసి ‘ఓ బేబీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మంచి స్నేహితులయ్యారు. నాగ్ శౌర్య బాగా సిగ్గరి. రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి బాగా ఇబ్బంది పడతాడని ‘ఓ బేబీ’ సినిమా ప్రమోషన్స్ లో సామ్ చెప్పిన సంగతి తెలిసిందే. 

అంతేకాదు.. ‘అశ్వద్ధామ’ కోసం నాగ్ శౌర్య సిక్స్ ప్యాక్ చేసిన ఫోటోపై సామ్ సరదాగా స్పందించింది. నాగ్ శౌర్య గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించింది. శౌర్యపై ఉన్న అభిమానంతో ఆయన తాజా చిత్రం ‘అశ్వద్ధామ’ టీజర్ ను సమంత లాంచ్ చేయబోతున్నారు. ఈ నెల 27న సమంత చేతుల మీదుగా ‘అశ్వద్ధామ’ టీజర్ రిలీజ్ కానుంది. 

శౌర్య స్వంత బ్యానర్ లో ‘అశ్వద్ధామ’ తెరకెక్కుతోంది. ఈ సినిమా కథని కూడా శౌర్యనే రెడీ చేశారు. విశాఖలో జరిగే నేరాల నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ సినిమా ఇది. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న సమస్యను ఇందులో చూపించబోతున్నారు. కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు. ఛేజ్ లు, ఫైట్ లు కూడా జోడించారు. ఈ సినిమా కోసం శౌర్య సిక్స్ ప్యాక్ కూడా చేశారు. జనవరి 31న  ‘అశ్వద్ధామ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.