సీఎం జగన్ హామీపై గవర్నర్’కు ఫిర్యాదు
మూడు రోజుల కడప పర్యటనలో భాగంగా సీఎం జగన్ అక్కడి ప్రజలకి వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కడప జిల్లా రాయచోటిలో దాతలు ఇచ్చిన జూనియర్ కళాశాల స్థలాన్ని ముస్లిం ప్రజలకు ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాన్నిఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పు పట్టారు.
దీనిపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దాతలు ఇచ్చిన నాలుగు ఎకరాల కళాశాల స్థలాన్ని జగన్ తన ఇష్టానుసారం దారాదత్తం చేయాలనుకుంటున్నారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కన్నా.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా పోలీసులను వాడుకుంటోందని ఆరోపించారు.