ప్రభాస్ పెళ్లి ప్రకటన వచ్చేసింది !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త పెళ్లి డేటు వచ్చేసింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్టు గతంలో ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. ప్రభాస్ పెద నాన్న సీనియర్ కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి అప్పుడు.. ఇప్పుడు అంటూ మూడ్నాలుగు ప్రకటనలు చేశారు. చివరకు ఆయన కూడా విసిగిపోయారు. ప్రభాస్ పెళ్లెప్పుడు ? అని ఆయన్ని అడిగితే.. ఆ విషయం మీరే ప్రభాస్ ని అడగండి అనే వరకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లెప్పుడు ? అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. తాజా ఈ ప్రశ్నకి ప్రభాస్ పెదమ్మ శ్యామలా దేవి సమాధానం చెప్పింది. వచ్చే యేడాది ప్రభాస్ పెళ్లి జరగనుందని గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తవ్వగానే పెళ్లి చేయాలనుకుంటున్నాం అన్నారు. మా కుటుంబంలో కలిసిపోయే తగిన అమ్మాయి కోసం చూస్తున్నామని ఆమె తెలిపారు.