అల.. పాటల ప్లేస్’మెంట్ ఇలా ఉండబోతుందట !
వచ్చే సంక్రాంతికి రెండు స్టార్ పుంజులు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. సూపర్ స్టార్స్ మహేష్, అల్లు అర్జున్ ల మధ్య బాక్సాఫీస్ యుద్ధం కొనసాగనుంది. ఐతే, రిలీజ్ కి ముందే పాటలతో హవా చూపిస్తున్నాడు బన్నీ. అల.. వైకుంఠపురంలో ఇప్పటి వరకు రిలీజైన నాలుగు పాటల్లో మూడు సూపర్ హిట్టే. మాములు హిట్ కాదు. టన్నుల కొద్ది వ్యూస్ సొంతం చేసుకొన్నాయి. అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటలుగా రికార్డులకెక్కాయి.
మరీ.. ఈ పాటలు సినిమాలో ఏ సందర్భంలో రాబోతున్నాయి. వాటి ప్లేస్ మెంట్ ఇలా ఉండబోతుంది అన్నది ఆసక్తికర అంశమే. ఈ సినిమా లో తొలుతగా వచ్చే సాంగ్, ఓ మై డాడీ అంటూ ర్యాప్ స్టయిల్ లో సాగే పాట. ఆ తరువాత వచ్చే పాట ‘సామజవరగమన’ సాంగ్ వస్తుందని తెలిసింది.
ఆ తరువాత ‘అల వైకుంఠపురములో’. ఈ పాట ముందు గతంలో అత్తారింటికి దారేదిలో వచ్చినట్లే శాస్త్రీయ ఆలాపన కూడా వుంటుంది. ద్వితీయార్థంలో ‘బుట్ట బొమ్మ’ సాంగ్ వస్తుంది, ప్రీ క్లయిమాక్స్ లో ‘రాములో..రాములా’ సాంగ్ వుంటుంది. చివర్న క్లయిమాక్స్ టైమ్ లో ఇప్పటి వరకు ఇంకా విడుదల చేయని శ్రీకాకుళం జానపద స్టయిల్ లో వుంటే చిన్న బిట్ సాంగ్ వస్తుందని తెలుస్తోంది.