‘అశ్వద్ధామ’ టీజర్ అదిరిపోయింది !

యంగ్ హీరో నాగశౌర్య కటౌట్ యాక్షన్ కథలకి సరిగ్గా సరిపోద్ది. ఐతే, ఆ దిశగా శౌర్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో వైవిధ్యమైన కథతో తన యాక్షన్ టాలెంట్ ని చూపించాలని శౌర్య డిసైడ్ అయినట్టున్నాడు. ఈ క్రమంలోనే.. విశాఖలో జరిగే నేరాల నేపథ్యంలో నడిచే ఓ థ్రిల్లర్ కథని రెడీ చేసుకొన్నాడు. అదే ‘అశ్వద్దామ’. ఆ కథని కొత్త దర్శకుడు రమణ తేజ చేతిలో పెట్టాడు.

శౌర్య సొంత బ్యానర్ లో తెరకెక్కిన అశ్వద్దామ వచ్చే యేడాది జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. టీజర్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు శౌర్య యాక్షన్ హైలైట్ గా నిలిచింది. “ఓ రాక్షసుడు.. వాడికి మాత్రమే తెలిసిన రహస్యం, సైరన్‌ కూతల కింద పని చేసే వాడి సైన్యం.. గమ్యం తెలియని ఓ యుద్దం.. ఆ యుద్దం గెలవాలంటే.. ఆరడగుల నారాయణాస్త్రం కావాలి.. ఒక అశ్వథ్థాముడు రావాలి..” అంటూ చెప్పిన డైలాగ్ కథ బలాన్ని చూపిస్తోంది. మొత్తంగా.. అశ్వద్దామ టీజర్ అదిరిపోయింది.