ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే.. !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. ముంచు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు ఈ సమావేశంలో ఏపీ రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంకా బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) కమిటి రిపోర్ట్ రావాల్సింది. జనవరి తొలివారంలో ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే రాజధానిపై నిర్ణయం ఉంటుందని మంత్రి షేర్న్ నాని మీడియాకు తెలిపారు.

ఏపీ కేబినేట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే..

* పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

* మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం

* కొత్తగా 108 వాహనాలు కొనుగోలు

* 412 వాహనాల కొనుగోలుకు రూ.78కోట్లు కేటాయింపు