‘భార్గవ్ హరి ప్రొడక్షన్స్’ పేరుతో ఎన్టీఆర్ బ్యానర్  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకూ బయటి నిర్మాతల సినిమాలతో పాటు, సొంత ప్రొడక్షన్ వంటి కల్యాణ్ రామ్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. అయితే తనకి కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండేలా చూసుకోవాలనే ఆలోచన ఎన్టీఆర్ చేస్తున్నట్టు సమాచారం.

తన తండ్రి .. తన తనయుడు పేర్లు కలిసి వచ్చేలా, ‘భార్గవ్ హరి ప్రొడక్షన్స్’ పేరుతో ఒక బ్యానర్ ను ఏర్పాటు చేయాలకుంటున్నాడట. మరో నటుడు రామ్ చరణ్ సలహా మేరకే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారమ్. ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారమ్.