నిత్యా బలమైన కోరిక

ముద్దుగుమ్మ నిత్యా మీన‌న్ కు తీర‌ని కోరిక ఒక‌టేన‌ట‌. అదే జాతీయ అవార్డు. దాన్ని సాధించ‌డ‌మే తన ల‌క్ష్యం అంటోంది నిత్యా. త‌న క‌థ అప్పుడే అయిపోలేద‌ని.. ముందు ముందు అనేక సినిమాలు చేసే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి, వాటిలో దేనితో అయినా త‌ను జాతీయ అవార్డును సొంతం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని నిత్యామీన‌న్ కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉంది. నిత్యా తీరు తెలిసిందే.

ఆమె కమర్షియల్ కాదు. కథ నచ్చితే తప్ప.. స్టార్ హీరో, పెద్ద బ్యానర్ అనే లెక్కలేవీ ఆమె దగ్గర ఉండవు. ఈ నేపథ్యంలో నిత్యాకి జాతీయ అవార్డు దక్కే పాత్ర దొరికుందేమో చూడాలి. ఇటీవ‌లే నిత్యా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ‘మిష‌న్ మంగ‌ళ్’తో అక్క‌డ గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో అచ్చం జయలలితగా ఒదిరిపోయింది. బహుశా.. అమ్మ పాత్ర ఆమె కోరిక తీరుస్తుందేమో. జాతీయ అవార్డుని తెచ్చిపెడుతుందేమో చూడాలి.