అల.. షూటింగ్ పూర్తి !

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్విట్ చేసింది. ఓ డ్యాన్స్ మూమెంట్ ఫోటోని షేర్ చేసింది. ఆఖరి షెడ్యూల్ లో చిత్రీకరించిన సాంగ్ ఇదని తెలుస్తోంది.

ఇక రేపు అల.. మ్యూజిక్ కన్సర్ట్ సంబంధించిన డిటేల్స్ ని ప్రకటిస్తామని చిత్రబృందం ట్విట్ చేసింది. త్రివిక్రమ్-బన్నీ కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వీరి కాంబోలో తెరకెక్కిన అల.. వైకుంఠపురంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

దానికి తగ్గట్టుగానే అల… రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. అల.. పాటలు రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటలుగా సామజవరగమన, రాములో రాముల సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. థమన్ అందించిన సూపర్ ట్యూస్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.