విశాఖ ఉత్సవ్’లో అపశృతి

 విశాఖ ఉత్సవ్’లో అపశృతి చోటు చేసుకుంది. రెండ్రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్ ను శనివారం సాయంత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐతే, దేవీశ్రీ ప్రసాద్ సంగీత విభావరి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. వేదికకి అతి సమీపంలో ఈ షార్ట్ సర్క్యూట్ అయింది. వెంటనే అప్రమత్తమైన నిర్వహకులు పోలీస్, విద్యుత్ విభాగాల సమన్వయంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సముద్ర కెరటాల ఉద్ధృతి కారణంగా వేదిక సమీపంలో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయినట్లు గుర్తించారు. ఇక తొలిరోజు విశాఖ ఉత్సవ్’లో ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుక వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరులేరు నీకెవ్వరు’ సినిమాలోని స్పెషల్ సాంగ్ #DaangDaang విడుదల చేశారు. ఆ సమయంలో వేదిక ఈలలు, కేకలతో మారుమ్రోగిపోయింది.