చిరు152 మరో కన్ఫూజన్

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్లాల్సిన సినిమా ఇది. ఐతే, సినిమాలో మెగాస్టార్ లుక్ ఫైనల్ కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకి చిరు లుక్ ఫైనల్ అయింది. దాంతో జనవరి 2 నుంచి రెగ్యూలర్ షూటింగ్ అన్నారు. కానీ, రెగ్యూలర్ షూటింగ్ మొదలుకావడానికి మరింత సమయం పట్టొచ్చన్నది లెటెస్ట్ న్యూస్.

నెల ఆలస్యంగా ఫిబ్రవరిలో చిరు152 రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది తెలుస్తోంది. ఆలస్యానికి కారణాలు ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. ఇక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం ఎలిమెంట్ తో ఈ సినిమా రాబోతోంది. కాకపోతే ఇది ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తుంది. సినిమాలో చిరు దేవదాయ శాఖ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. ఆయనకి జంటగా త్రిష నటించనుంది. మణిశర్మను సంగీతం అందించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాటినీ ఎంటర్‌ టెయిన్ మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.