‘మిడిల్ క్లాస్ అబ్బాయి’కి వదిన సెంటిమెంట్ !
భూమిక.. అందం+అభినయం తెలిసిన నటి. ‘యువకుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్’లో స్టార్ హీరోలతో ఆడిపాడింది. పవన్ ‘ఖుషి’, మహేష్ ‘ఒక్కడు’, ఎన్టీఆర్ ‘సింహద్రి’ సినిమాల్లో నటించింది. తెలుగు,తమిల్, మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. ‘మిస్పమ్మ’ సినిమాకు గానూ నంది అవార్డు అందుకొంది.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు తెరకు రీ-ఎంట్రీ ఇస్తోంది భూమిక. నేచురల్ స్టార్ నాని ఎంసిఎ “మిడిల్ క్లాస్ అబ్బాయి” సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. సినిమాలో ఆమెది వదిన పాత్ర. హీరో నానికి వదిన అన్నమాట. ఈ సినిమా కూడా వదిన, మరిది మధ్య ఉండే అప్యాయత, అనుబంధాలతో సాగే కథ కావడం విశేషం. తెలుగులో వదిన, మరిదిల సెంటిమెంట్ పై సినిమాలొచి చాన్నాళ్లయ్యింది. మరీ.. నానికి వదిన (భూమిక)పై ఉండే ప్రేమ, ఆప్యాయత ఎలాంటిది అన్నది ఈ నెల 22తో తెలియనుంది. ఆ రోజే మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.