ఈ సారి ‘మల్టీస్టారర్ సత్తా’రు
‘చందమామ కథలు’ సినిమాతో జాతీయ అవార్డుని అందుకొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అంతకు ముందు ‘ఎల్బీడబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టోరీ’ సినిమాలు చేశారు. ‘గుంటూరు టాకీస్’ లాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేశారు. ఈ యేడాది ఆయన రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన “గరుడవేగ” సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొంది. దీంతో ఈ సినిమా తర్వాత సత్తారు చేయబోయే సినిమా ఏంటన్నది దానిపై ఆసక్తి నెలకొంది. ఐతే, ఈసారి ఓ మల్టీస్టారర్ సినిమాతో సత్తా చేటేందుకు రెడీ అయ్యాడు.. ఈ దర్శకుడు.
ముందుగా నితిన్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసుకొన్నాడు ప్రవీణ్ సత్తారు. ఐతే, ఈ సినిమాలో హీరో రేంజ్ లో మరో రెండు పాత్రలు కూడా ఉన్నాయట. ఆ పాత్ర కోసం రానా దగ్గుపాటి, నారా రోహిత్ లని సంప్రదించాడట. వీరు ఓకే చెబితే.. సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇదే జరిగితే.. ఈ సారి మల్టీస్టారర్ సినిమాతో సత్తా చాటబోతున్నాడు.. ప్రవీణ్ సత్తారు.