వైరల్ : ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ ట్విట్

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. న్యూ ఇయర్ కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుంచి సప్రైజ్ రానుందని భావించారు. కానీ, రాలేదు. పాత పోస్టర్ తోనే న్యూ ఇయర్ విషెస్ చెప్పింది ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం. అయితే, హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ అభిమానులని సప్రైజ్ చేసింది.

“2020 శుభాకాంక్షలు చెబుతూ.. తాను ఈ చిత్రం కోసం ఎంతో ఎదురు చూస్తున్నా”నని ట్విట్ చేసింది. ఇప్పుడీ ట్విట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. ఆయనకి జోడీగా ఓలివియా కనిపించనుంది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ హైలైట్ గా ఉంటాయని చెబుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 80శాతంపైగా పూర్తయినట్టు తెలుస్తోంది. జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.