మోహన్ బాబుకి ముద్దుపెట్టిన చిరు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో షాకింగ్, సరదా విషయాలు చోటు చేసుకున్నాయి. అసోసియేషన్ లోని లుకలుకలపై రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. మంచి ఉంటే బయటికి చెప్పండి. చెడు ఉంటే చెవిలో చెప్పండని.. చిరు అన్నారు. దానికి భిన్నంగా రాజశేఖర్ స్పందించడంతో కార్యక్రమం వేడెక్కింది. ఆయన వ్యాఖ్యలను చిరంజీవి తప్పుబట్టారు.
అనంతరం మోహన్ బాబు ప్రసంగిస్తుండగా అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చిరంజీవి కనిపిస్తే ఏదో అనాలని తాను అనుకుంటానని.. ఐతే ఇదంతా సరదాలో భాగమే. ఆయన కుటుంబం, తన కుటుంబం వేర్వేరు కాదని అన్నారు. దీనికి స్పందించిన చిరంజీవి వెంటనే లేచి మోహన్ బాబును ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం మోహన్ బాబు బుగ్గపై ముద్దు పెట్టారు.