ఏపీలో సకల జనుల సమ్మె
తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని పోరాడాలని ఏపీ రాజధాని అమరావతి రైతులు నిర్ణయించుకున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసే దిశగా సీఎం జగన్ సర్కార్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో చట్ట సభలని ఉంచుతూనే.. విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని తరలించాలనే ప్లాన్ లో ఉన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అమరావతి రాజధానులు తీవ్రంగా వ్యక్తికేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని గత 16రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇకపై ఆ ఆందోళనలని ఉదృతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, పౌర సరఫరా తప్ప మిగతా అన్ని కార్యకలాపాలు బంద్ చేయాలని నిర్ణయించారు. తద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని చెబుతున్నారు. మరోవైపు, తమకి ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఇవ్వాలని అమరావతి రైతులు రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో.. అమరావతి రైతుల ఆందోళనలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.