సంక్రాంతి పుంజుతో త్రివిక్రమ్.. కేక !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ని సంక్రాంతి పుంజుగా తీసుకొస్తున్నాడు త్రివిక్రమ్. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నుంచి అభిమానుల హంగామా మొదలైంది. అల.. బ్యానర్లు, కటౌట్స్ ని పెట్టేస్తున్నారు. 

పందెం కోడితో బన్నీ, ఆయన్ని బరిలోకి దించుతున్నట్టు త్రివిక్రమ్ తో.. రెడీ చేసిన ఓ కటౌట్ తెగ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని థమన్ లైక్ కూడా లైక్ చేశారు. కేక.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బన్నీ అభిమానులు ఇలాంటి హడావుడి చేయడం సహజమే. కానీ, బన్నీతో పాటు త్రివిక్రమ్ ని సంక్రాంతి పందెంలోకి దించడం ఆకట్టుకుంటోంది.

త్రివిక్రమ్-బన్నీ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో వీరికలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. అల.. పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బన్నీకి  జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. యువ హీరోలు సుశాంత్, నవదీప్ లకి కీలక పాత్రలు దక్కాయి.