చిరు-మోహన్ బాబులని.. ఆ పార్టీయే దగ్గర చేసిందా ?
గురువారం జరిగిన ‘మా’ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభలో మోహన్ బాబుకి చిరంజీవి ముద్దుపెట్టడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2020 ప్రారంభానికి ఇదే బెస్ట్ పిక్ అంటూ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ అన్నారు. అవునూ.. అది నిజమేనని అందరూ అంగీకరిస్తున్నారు. ఎందుకంటే.. ? మోహన్ బాబు-చిరుని ఇలా చూస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఇదో సప్రైజ్ అని చెప్పాలి. ఎందుకంటే.. ? దర్శకరత్న దాసరి మెగాస్టార్ చిరంజీవిపై అవాక్కులు, చివాక్కులు పేల్చేవారు.
ఆయన శిష్యుడు అయిన మోహన్ బాబుకు చిరుతో విబేధాలు ఉన్నట్టు ప్రచారం జరిగేది. అవి నిజమే అన్నట్టుగా.. చిరుపై మోహన్ బాబు సటైరికల్ గా మాట్లాడేవారు. అవేవో సరదాగా చేసినవి. మా మధ్య విబేధాలేవీ లేవని గురువారం మా డైరీ ఆవిష్కరణ సభలో మోహన్ బాబు అన్నారు. అంతేకాదు.. చిరు ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఒక్కటే అంటూ దగ్గర చేసి మాట్లాడారు. దాంతో ఆనందంతో చిరు మోహన్ బాబుకి ముద్దుపెట్టారు. అది కాస్త వైరల్ అయింది.
అయితే, మోహన్ బాబు-చిరు ఆలింగనం, ఆప్యాయత వెనక ఓ పొలిటికల్ పార్టీ ఉన్నట్టు.. అదే వీరిద్దరి దగ్గర చేసిందని చెప్పుకొంటున్నారు. అదే.. ఏపీలో అధికార పార్టీ వైకాపా. మోహన్ బాబుకు సీఎం జగన్ బంధువు అన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో సీఎం జగన్ నిర్ణయాలని చిరు పొగిడారు. ఈ నేపథ్యంలో వైకాపా ఖాతాలో చిరుని రాజ్యసభకి పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం కూడా ఉంది. మోహన్ బాబుకు ఆశలు ఉన్నాయి. ఒకే పార్టీపై ఆసలు పెట్టుకున్న వీరిద్దరు.. ఆనందంగా ముద్దుపెట్టుకున్నారని చెప్పుకొంటున్నారు. ఇది గాసిప్ మాత్రం. అప్పుడప్పుడు అవి నిజమవుతాయి కూడా.. !!