వైఫై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
వైఫే హీరోయిన్ గుంజన్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ముంబై నుండి సౌత్ సినీ ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్లపై చెడు అభిప్రాయాలు చాలానే ఉంటాయని.. డబ్బుల కోసం ఎలాంటి నీచమైన పాత్రలు చేయడానికైనా వెనుకాడరని అనుకుంటారని.. కానీ తను అలాంటి దాన్ని కానని చెబుతోంది గుంజన్. అంతేకాదు.. టాలెంట్ లేనప్పుడు ఎంతమందితో పడుకుంటే ఏం లాభమని ప్రశ్నిస్తోంది.
నలుగురు అమ్మాయిలు లంగావోనీ వేసుకొని ఒక అమ్మాయి పొట్టి గౌన్ వేసుకుంటే.. కచ్చితంగా జనాలు గౌన్ వేసుకున్న అమ్మాయినే చూస్తారని.. ప్రస్తుతం సమాజం అలా ఉందని చెప్పుకొచ్చింది. ప్రొఫెషన్ కోసం ఓ నటి ఎక్స్ పోజింగ్ చేస్తే ఆమెని పోర్న్ స్టార్ ఎలా అంటారని ప్రశ్నించింది. మొత్తానికి.. తాను పడకగది పిలుపులకి లొంగని చెప్పే ప్రయత్నం చేసింది.
తాను అందమైన ఫిగర్ ని, నా అందాన్ని చూపించుకోవాలనుకొంటున్నా. అందులో తప్పేముంది ? అని ప్రశ్నించింది గుంజన్. వైఫై సినిమాకి ముందే రెండు, మూడు వెబ్ సిరీస్ లో నటించా. ప్రస్తుతం తన చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఐతే ‘వైఫే’కి వచ్చే రెస్పాన్స్ బట్టి వాటిని ఓకే చేయాలో వద్దో అనే నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.