పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ

కలిసి రాకుంటే పేరు మార్చుకుంటుంటారు. వరుస ప్లాపుల్లో ఉన్న మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తన పేరుని సాయితేజుగా మార్చుకొన్న సంగతి తెలిసిందే. అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. పేరు మార్చుకొని చేసిన ‘చిత్రలహరి’ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత చేసిన ప్రతిరోజూ పండగే మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కు కొత్త పేరు కలిసొచ్చింది.

ఇప్పుడు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కూడా తన పేరుని మార్చుకొన్నారు. ఆయన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

టీజర్ లో విజయ్ దేవరకొండ పేరు మార్చుకున్న విషయాన్ని గుర్తించవచ్చు. ‘దేవరకొండ విజయ సాయి’ అని పెట్టుకున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇంకా చెప్పాల్ంటే స్టార్ హీరోలని మించిపోయాడు. ఈ లెక్కన విజయ్ దేవరకొండ పేరు బాగా కలిసొచ్చింది. అలాంటి సమయంలో ఆయన పేరు మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది.