ఎన్టీఆర్’కు గుండు కొట్టించారా ?


యంగ్ టైగర్ ఎన్టీఆర్’కు గుండుకొట్టించారా ? ఆయన గుండుతో కనిపించబోతున్నాడా ?? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొమరంభీమ్, అల్లూరి సీతారామ రాజు జీవికథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరు వీరుల ఉమ్మడి పాయింట్ తో ఆర్ఆర్ఆర్ కథని రాసుకొన్నారు జక్కన్న.

ఇందులో కొమరంభీమ్ గా ఎన్టీఆర్, ఆయనకి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు.. ఇక అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. తాజాగా ఎన్ టీఆర్ పాత్రకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. కొమరంభీమ్ పాత్రలో తారక్ తలపాక కట్టుకొని కనిపిస్తారు. కానీ, ఓ సందర్భంలో ఆయన గుండుతో కనిపిస్తారని తెలిసింది. అది సహజంగా వచ్చేందుకు తారక్ కి నిజంగానే గుండుకొట్టారని కూడా చెప్పుకొంటున్నారు. ఇందులో నిజమెంత ? అనేది ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో తెలవాలి. లేదంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.