వరుణ్ తేజ్ బాక్సర్ లుక్

టాలీవుడ్ తీరు మారుతోంది. కాదు మారింది. రొటీన్ ని పక్కన పెట్టి కొత్తగా ట్రై చేస్తున్నారు. అలా చేస్తేనే దర్శకులు, హీరోలకైనా విజయాలు దక్కుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ సినిమాలతో విజయాలు అందుకున్నారు.

ఆయన తాజా చిత్రం కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా కోసం కొన్నాళ్ళుగా  బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు  వ‌రుణ్ . బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో బాక్స‌ర్‌గా  క‌నిపించ‌నున్నాడు. తాజాగా బాక్సర్ లుక్ లో రాకింగ్ లుక్ ఒకటి బయటికొచ్చింది. గడ్డెం లుక్ లో వరుణ్ తేజ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.