అడగండీ.. రస్మిక సమాధానిమిస్తుంది !

యంగ్ హీరోయిన్ రష్మిక మందన ఇటీవలే మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రస్మిక అభిమానులు #3YearsOfRashmikaInCinema పేరిట సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో రస్మిక బిజీగా ఉండటంతో అభిమానుల కోసం ఏమీ చేయలేకపోయింది. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ని పూర్తి చేసిన రస్మిక.. ఇటీవల భీష్మ కోసం ఫారిన్ షెడ్యూల్ కి వెళ్లొచ్చింది. దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని అభిమానుల కోసం కేటాయించింది.

#RashmikaReplies అంటూ ట్విట్టర్ వేదికగా అభిమాలతో చిట్ చాట్ చేస్తోంది. దీంతో అభిమానులు బోలేడు ప్రశ్నలు సందిస్తున్నారు. వాటికి ఓపిగ్గా రస్మిక సమాధానం ఇవ్వనుంది. తమిళ్ సినిమాలు ఎప్పుడు చేస్తారా.. ? తమిళ్ స్టార్ విజయ్ తో ఎప్పుడు నటిస్తున్నారు. మీకు నచ్చిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది.. ?? సరిలేరు సినిమా సెట్స్ లో జరిగిన ఫన్నీ సీన్స్ ఏంటీ ?? హాట్ గా ఉన్నారంటూ.. సరిలేరు సెట్స్ లోని ఫోటో..  ఇలా అభిమానుల నుంచి రస్మికకి లక్షల్లో ప్రశ్నలు క్యూ కడుతున్నాయి. ఇక  #RashmikaReplies హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండెంట్ టాప్ లో కొనసాగుతోంది.