వైకుంఠ ద్వార దర్శనం 2రోజులు మాత్రమే
శ్రీవారి వైకుంఠ ద్వారాలను 10 రోజులు తెరవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు సమావేశమై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 ఈ విధానం అమల్లోకి వస్తుందని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకే ఉచిత లడ్డూ అందిస్తామన్నారు.