శ్రీలంకతో టీమిండియా.. తొలి టీ20 రద్దు !
శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 రద్దయింది. బర్సపర స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సా 6:30 గంటలకే టాస్ వేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొన్నారు. ఐతే, మ్యాచ్‌కు ముందే అరగంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. దాంతో.. పిచ్ తడిసిముద్దైపోయింది.
మైదానం సిబ్బంది తేమ తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలూ చేసినా పరిస్థితిలో మార్పు కనపడలేదు. మూడు సార్లు అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రెండో టీ20 ఇండోర్ వేదికగా మంగళవారం జరగనుంది. మూడో మ్యాచ్‌కు జనవరి 10న పుణె వేదిక కానుంది. మంచి ఫాలో ఉన్న టీమిండియా ఈ సిరీస్ ని ఈజీగా గెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.