వండర్ లొకేషన్.. గ్రాండ్ సెలబ్రేషన్…విరాట్ పెళ్లి ఎంత అద్భుతమో..!!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ హాలిడే డెస్టినేషన్ లో విరాట్ అనుష్క పెళ్లి జరుగుతోందట. ఇటలీ దేశంలో మిలన్ కి చేరువలో తస్కనీ లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుకను చూసేందుకు రెండు కళ్లు చాలడంలేదట. మిలన్ నుంచి 4 గంటలు డ్రైవ్ చేస్తూ అక్కడికి వెళ్ళాళట..సియోన స్టేషన్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో పెళ్లి జరిగే చోటుంటుంది. అదిగో అక్కడే ఉంది బొర్గో ఫినిషియోటో రిసార్ట్స్. అదే విరాట్ అనుష్క పెళ్లి వేడుక జరుగుతున్న చోటు.
ఈ సంవత్సరం ప్రధామార్ధంలోనూ ఒబామా ఇక్కడే తన విహారాయాత్రకు వచ్చారట. వీరాట్, అనూష్క పెళ్లి చేసేది కూడా ప్రముఖ పూజారి ఆనంతధామ్ ఆత్మబోధ్ ఆశ్రమం పెద్ద.. మహారాజ్ అనంత్ బాబా. ఇతనిని హరిద్వార్ నుంచి ఇటలీ పిలిపించుకున్నారట. ఈ నెల 8 న ముంబై నుంచి తన తల్లిదండ్రులతో మిలన్ బయల్దేరి వెళ్లిందట అనూష్క . అదేరోజు అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇటలీ వెళ్లారట విరాట్.
ఇక పెళ్లి జరుగుతున్న తీరు అబ్బబ్బో అదో అద్భుతం.. బంగ్రా నృత్యాలు, కుటుంబ సభ్యుల డాన్సులతో మధ్య సందడే సందడి. ఈ నెల 9 నుంచి 12 వ తేదీ వరకు బొర్గో ఫినిషియోటో రిసార్ట్ బుక్ చేసుకున్నారట విరాట్ అనుష్క ఫామిలీ. మూడురోజులు మిన్నంటే సంబరాలు చేసుకుంటున్నారట కుటుంబ సభ్యులు.
జనవరి 4 న బాంద్రా ఫామిలీ కోర్టులో విరాట్ అనూష్క పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో వారి వివాహ ఘట్టం ముగుస్తుందట. ఇందుకోసం ఇప్పటికే అనుష్క అప్లికేషన్ పెట్టుకుందట.