సీఎం జగన్ తల్లి, చెల్లికి కోర్టు సమన్లు

ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ, ఆయన చెల్లెలు షర్మిలకి హైదరాబాద్ ప్రత్యేక కోర్టు సమన్లు జారిచేసింది. ఇవి అవినీతి ఆరోపణలకి సంబంధించిన సమన్లు కాదు. 2012 ఘటనకి సంబంధించినది. 2012లో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ ఏర్పాటు చేశారని, తద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పరకాల పోలీస్ స్టేషన్ లో వైఎస్ విజయమ్మ, షర్మిలపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో విజయమ్మ, షర్మిలకి హైదరాబాద్ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.

ఇదే కేసులో తెలంగాణకి చెందిన నేతలు కొండా సురేఖ, కొండా మురళిలకు కూడా సమన్లు జారీ అయ్యారు. వీరందరూ.. ఈ నెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే రోజు ఏపీ సీఎం జగన్ కూడా సీబీఐ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కోర్టు చుట్టూ తిరిగుతున్న సంగతి తెలిసిందే.