తెలుగు సినిమాపై టబు ఏమన్నారంటే.. ?

టబు.. తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన హీరోయిన్. ఇష్టమైన హీరోయిన్. మన హైదరాబాద్ అమ్మాయినే. బాలీవుడ్ కెళ్లి అక్కడ.. స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాల్లో నటించారమే. ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో టబు తెలుగు తెరకు రీ-ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు పరిశ్రమకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఇంతకంటే గొప్ప సినిమా దొరకదని ఆమె అన్నారు. 

సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ అల.. మ్యూజికల్ నైట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకి హాజరైన టబు మాట్లాడుతూ..  “చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నా. చాలా గర్వంగా ఫీలవుతున్నా. 10యేళ్ల తర్వాత నటించిన తెలుగు సినిమా ఇది. రీ-ఎంట్రీకి ఎంతకంటే గొప్ప సినిమా దొరకదేమో. అల్లు అర్జున్, త్రివిక్రమ్, సుశాంత్ తనకి ఫ్యామిలీలా మారారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చితే.. నా జెర్నీ సక్సెస్ అవుతుంది” అన్నారు. ఇక టబు స్టేజ్ పైకి రాగానే అభిమానులు ఈలలు, కేకలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవి చూసిన టబు.. కాస్త ఎమోషన్ అయ్యారు.