ఆ మాటలు హాయిని, ఆనందాన్నిచ్చాయ్


మాటల మాంత్రికుడని ఊరికే అనరు. మాటలతో మాయ చేసి.. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే హాయిని, ఆనందాన్ని పంచేంత అదను, పదను ఉండాలి.  ఆ పదను త్రివిక్రమ్ మాటకుంది. అందుకే ఆయన్ని మాటల మాంత్రికుడు అంటారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ‘అల.. వైకుంఠపురంలో’ మ్యూజికల్ నైట్ లో త్రివిక్రమ్ మాట పదను మరోసారి వినిపించింది.

మనస్సులోపల నుంచి మాటలు వస్తే ఇలాగే ఉంటాయేమో. ఓ సామాన్యుడు.. తాను అనుభవించిన ఆనందాన్ని బయటికి చెప్పగలిగితే.. ఆ ఆనందపు మాటలు ఇలాగే ఉంటాయేమో. అసలు సిసలు ప్రతిభకి పట్టకట్టడం అంటే ఇదేనేమో అన్నట్టుగా త్రివిక్రమ్ స్పీచ్ సాగింది. పాటకి పూజా చేసిన త్రివిక్రమ్.. అల.. పాటలు అంత అద్భుతంగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందలు, ఆశీస్సులు తెలిపారు.

వారందరూ తెరపై కనిపించేలా ఓ ఐడియా కావాలని.. దాన్ని కార్యరూపం దాల్చేలా సామజవరగమన వీడియోని బయటికి తీసుకొచ్చేలా చేసిన అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా అభినందించారు. త్రివిక్రమ్ స్పీచ్ ని ఆయన మాటల్లాగా అందంగా, అద్భుతంగా చెప్పడం జరిగే పని కాదు… ఆయన స్పీచ్ ని ఆయన మాటల్లోనే వినేయండీ.. !