ప్రభాస్ టైటిల్ దొంగలించబడింది !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దొంగలించబడింది. అవునూ.. సాహో తర్వాత జిల్ ఫేం రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. ఇదో ప్రేమకథా చిత్రం. పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమా కోసం మొదటి నుంచి ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దాదాపు ఈ టైటిల్ నే ఫిక్సయినట్టేనని చెప్పుకొంటున్నారు.
ఇలాంటి సమయంలో జాన్ టైటిల్ దొంగలించబడింది. శర్వానంద్ – సమంత జంటగా తమిళ్ హిట్ 96 రిమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ని ‘జాను’గా నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. జాన్, జాను పేర్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ టైటిల్ దొంగలించబడిందని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన నిరసనని తెలిపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ సినిమా టైటిల్ ‘జాన్’ అనేది ప్రచారం మాత్రమే. బహుశా.. దిల్ రాజు ప్రభాస్ ని సంప్రదించిన తర్వాతే తెలుగు 96కి జాను టైటిల్ ని ఫిక్స్ చేసి ఉంటారేమో.. ! ఇప్పుడు ప్రభాస్ ప్రేమకథా టైటిల్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. జాన్ టైటిల్ ఎగిరిపోవడంతో.. ప్రభాస్ ప్రేమకథా చిత్రం టైటిల్ చెప్పమని అభిమానులని ఒత్తిడి పెరగొచ్చేమో. ఇక శర్వా-సమంతల జాను చిత్రానికి మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి జాను ప్రేక్షకుల ముందుకు రానుంది.