మున్సిపల్ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్‌ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దాంతో మున్సిపల్ ఎన్నికలకి లైన్ క్లియర్ అయినట్టయింది. పాత షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలని నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం యథాతథంగా మున్సిపల్‌ ఎన్నికలని నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి మీడియా తెలిపారు. తెలంగాణలోని 118 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. జనవరి 11న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. జనవరి 14 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ. జనవరి 22న పోలింగ్, 25న ఫలితాలు వెల్లడించనున్నారు.