అల.. జ్యూక్ బాక్స్ వచ్చేసింది !

‘అల.. వైకుంఠపురంలో’ పాటలతోనే రికార్డులకి తెరలేపిన చిత్రమిది. ఈ సినిమా నుంచి తొలిపాటగా వచ్చిన సామజవరగమన అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన రాములో రాములో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇక ఓ మై డాడీ, అల.. వైకుంఠపురంలో టైటిల్ సాంగ్, బుట్టబొమ్మ సాంగ్ దేనికదే ప్రత్యేకంగా నిలిచాయి.

ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లో అల.. వైకుంఠపురంలో మ్యూజికల్ నైట్ ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని విడుదల చేసింది. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. సినిమాలో ఆరో పాట కూడా ఉంది. శ్రీకాకుళం యాసలో సాగే పాట అది. దాన్ని నేరుగా థియేటర్ లోనే చూపిస్తామని చెప్పింది చిత్రబృందం. ఈ చిత్రానికి థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అల.. జ్యూక్ బాక్స్ మీ కోసం.. !