చిత్తూరులో జర్నీ సినిమా సీన్.. ఇద్దరు మృతి !
చిత్తూరులో జర్నీ సినిమా సీన్ రిపీట్ అయింది. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై కాశిపెంట్ల సమీపంలో బుధవారం వేకువజామున ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు సహాయకుడు మృతి చెందారు. మహబూబ్ నగర్ కి చెందిన అయ్య స్వాములతో సహా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో, లారీలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
మంగళవారం రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి చిత్తూరు జిల్లా కుప్పంకు అమరావతి వోల్వో బస్సు బయలుదేరింది. శబరిమల నుంచి నల్గొండకు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న వోల్వో బస్సును ఢీకొట్టింది. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎంతలా అంటే.. ? జర్నీ సినిమాలో యాక్షిడెంట్ సీన్ ని తలపించాయి. యాక్షిండెంట్ తర్వాత ఆబులెన్స్ లు ఆలస్యంగా రావచ్చాయని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు.